- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:రేపు వారికి సెలవు రద్దు.. మెమో జారీ
రాష్ట్ర ప్రభుత్వం(State Government) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(State Government) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(ఏప్రిల్ 12) రెండో శనివారం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల(Sub-Registrar Offices)కు రేపు(శనివారం) ప్రభుత్వం సెలవు రద్దు చేసింది. ఈ తరుణంలో ఏపీ(Andhra Pradesh)లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రేపు యథావిధిగా పని చేయనుంది.
రేపు(రెండో శనివారం) వర్కింగ్ డేగా ప్రకటిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా మెమో జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేయనున్నాయి. ఈ క్రమంలో హాలిడే సమయాల్లో రూ.5వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే రేపు మాత్రం రూ.5వేలు తీసుకోకుండానే రిజిస్ట్రేషన్లు చేయాలని ఏపీ ప్రభుత్వం(AP Government) నిర్ణయించింది.






