- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Nara Lokesh:సింగపూర్ టూర్ సక్సెస్.. స్వదేశానికి బయల్దేరిన యువనేత
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఇవాళ(గురువారం) ఉదయం స్వరాష్ట్రానికి బయలుదేరిన మంత్రి లోకేష్‌కు అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. కనీవినీ ఎరుగని రీతిలో సింగపూర్ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తల నుంచి లభించిన స్పందన ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను ఇనుమడింపచేసింది. నాలుగు రోజుల పర్యటనలో సీఎంతో కొన్ని, విడిగా మరికొన్ని కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్తలతో వన్ టు వన్ చర్చలు 19, జి టు జి (గవర్నమెంట్ టు గవర్నమెంట్) సమావేశాలు 6, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, సైట్ విజిట్లు, రోడ్ షో/డయాస్పోరా ఈవెంట్స్ 2 కలిపి మొత్తం 35 కార్యక్రమాలకు లోకేష్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో సింగపూర్ వెళ్లిన బృందానికి సామాన్య తెలుగు ప్రవాస భారతీయుడి మొదలు.. ఆ దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగ రత్నం వరకు అపూర్వ స్వాగతం లభించింది. ఈనెల 27వ తేదీన తొలిరోజు ఎపిఎన్ఆర్‌టి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ చేసిన ప్రసంగం సింగపూర్ ఎన్ఆర్ఐలలో స్పూర్తినింపింది.
ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేయడంలో ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేష్ ఇచ్చిన పిలుపు వారిలో చైతన్యాన్ని రగిల్చింది. 4 రోజుల పర్యటనలో ఎయిర్ బస్, ఎవర్ వోల్ట్, గూగుల్ క్లౌడ్, మైక్రో సాఫ్ట్, మురాటా ఇంజనీరింగ్, కెరియర్, ఇన్ఫినియన్, ఐవీపీ సెమి, క్యాపిటా ల్యాండ్, ఎబీమ్ కన్సల్టింగ్, డిటిడిఎస్ వంటి గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్ ఫలవంతమైన చర్చలు జరిపారు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు నెలకొన్న అనుకూలతలు, అనుసరిస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, అందజేస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను వివరిస్తూ మంత్రి జరిపిన చర్చలు పారిశ్రామికవేత్తలను ఆలోచింపజేశాయి.
ఏపీలో పరిశ్రమలు స్థాపించడం వల్ల కలిగే ప్రయోజనాలను లోకేష్ ద్వారా ఆసక్తిగా తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు తమ సంస్థల ఉన్నతస్థాయి బృందాలతో చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని మాట ఇచ్చారు. ఒకసారి ఎంఓయుపై సంతకం చేశాక అనుమతుల నుంచి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే వరకు ఆయా సంస్థల పూర్తి బాధ్యత తమదేనంటూ రెండో రోజు ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి ఇచ్చిన భరోసా పరిశ్రమ దారులను ఆకర్షించింది. నాలుగు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని అమరావతి చేరుకున్న సీఎం చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.






