- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అలా చేయాలని వేధిస్తున్నాడు’.. మహిళ తీవ్ర ఆవేదన!
తిరుపతి జిల్లా(Tirupati District)లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District)లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడు అడుగులు నడిచిన భర్త తన భార్యతో న్యూడ్ కాల్స్ చేయాలంటూ వేధించిన ఘటన కలకలం రేపుతోంది. ప్రైవేట్ యాప్‌లో న్యూడ్ కాల్స్ చేయాలని.. తన భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ ఆరోపించారు. నిన్న(శనివారం) రాత్రి ఆమె తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. తన భర్త పెయింటింగ్ పనిచేసేవారని చెప్పారు.
కానీ కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ప్రైవేట్ యాప్‌లో న్యూడ్‌కాల్స్ చేస్తే డబ్బులు వస్తాయని నచ్చజెప్పి డబ్బులు సంపాదించాడని తెలిపింది. రెండున్నరేళ్ల పాటు ఇలా చేయడంతో రూ.18 లక్షలు వచ్చాయని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ఇకపై అటువంటి పని చేయనని చెప్పడంతో తన పై భౌతిక దాడులు చేశారని ఆమె వాపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో పెట్టారన్నారు.
దీంతో తాజాగా ఆమె చేసిన వీడియో వైరల్(Video Viral) కావడంతో భార్య తనకు వద్దని విడాకులు కావాలని వేధిస్తున్నాడని ఆ మహిళ ఆవేదనకు గురయ్యారు. అంతేకాదు తన భర్త కుటుంబ సభ్యులు తనపై దాడులకు పాల్పడ్డారన్నారు. తన పిల్లలను కూడా చూడనివ్వలేదని ఆవేదన చెందింది. ఈ ఘటన పై రామచంద్రాపురం పోలీస్ స్టేషన్(Police Station)లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.






