ఏపీపై విరుచుకుపడనున్న ద్రోణి: పలు ప్రాంతాలకు ‘హై అలర్ట్’

by Vemula.Srinu Prasad |

ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంపై ద్రోణి ప్రభావం ఏర్పడింది. దీంతో రానున్న మూడు గంటల్లో వాతావరణంలో పెను మార్పులు సంభవించనున్నాయి..

ఏపీపై విరుచుకుపడనున్న ద్రోణి: పలు ప్రాంతాలకు ‘హై అలర్ట్’
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో వాతావరణం(Weather) ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంపై ద్రోణి(Droni) ప్రభావం ఏర్పడింది. దీంతో రానున్న మూడు గంటల్లో వాతావరణంలో పెను మార్పులు సంభవించనున్నాయి. విజయవాడ, నూజివీడు, భీమవరం వంటి ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైందని, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భీమడోలు, గుడివాడ, గన్నవరం పరిసర ప్రాంతాలకు వాతావరణ శాఖ ప్రత్యేక అలర్ట్ జారీ చేసింది.

ఇక వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అంతేకాదు ఈ ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సైతం చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


Next Story