Cyclonic Storm Montha: సముద్రం వద్ద వాతావరణం అల్లకల్లోలం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-27 11:16:38  IST  )

కాకినాడలో సముద్రం వద్ద వాతావరణం అల్లకల్లోలంగా మారింది..

Cyclonic Storm Montha: సముద్రం వద్ద వాతావరణం అల్లకల్లోలం
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతం(Bay of Bengal)లో మొంథా తుపాను ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఇది కాకినాడకు 550 కిలో మీటర్లు, విశాఖ(Visakha)కు 600 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. దీంతో ఆ ఎఫెక్ట్ ఏపీ(Ap) జిల్లాలపై కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు మొంథా తుపాను(Storm) ప్రభావం కాకినాడ జిల్లా(Kakinada District)లో కొనసాగుతోంది. తుపాను కారణంగా సముద్రం(Sea) వద్ద వాతావరణం(Weather) అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి గాలులు భారీగా వీస్తున్నాయి. దీంతో తీర ప్రాంత మండలాల్లో హైఅలర్ట్(High Allert) ప్రకటించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.


అటు ఉప్పాడ సముద్ర తీరం వద్ద సైతం అల్లకల్లోలంగా పరిస్థితి మారింది. భారీ అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. బీచ్ రోడ్డు మార్గాన్ని మూసివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Next Story