ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: మంత్రి అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

యూరియా కొరతపై టీడీపీ, వైసీపీ(Ycp) నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది...

ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: మంత్రి అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న యూరియా(Urea) కొరతపై కూటమి నాయకులు, వైసీపీ(Ycp) నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. రైతు(Farmers)లకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు కారణం అవినీతి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నాయకులు విమర్శిస్తున్నారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు సైతం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో అన్ని వ్యవస్థలు ధ్వంసం, నిర్వీర్యం, అవినీతిమయమని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖపై వైసీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. రైతులకు అందించాల్సిన యూరియా బస్తాల్లో అవినీతికి పాల్పడ్డారని విమర్శలు కురిపిస్తున్నారు.

దీంతో మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) స్పందించారు. యూరియాలో అవినీతి జరిగిందని వైసీపీ నాయకులు సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యూరియాకు సంబంధించి రూ. 250 కోట్లు అవినీతి జరిగిందని అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సేవాకేంద్రాల్లో యూరియా బస్తాపై అదనంగా ఒక్క రూపాయి సైతంతీసుకోలేదని మంత్రి అచ్చెన్న తెలిపారు.

Next Story