ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కారణం ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-17 11:10:45  IST  )

ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది....

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ(Delhi)లో ఉపరాష్ట్రపతి ఎన్నిక(Vice President Election) జరగనుంది. ఈ మధ్యకాలం వరకూ ఉపరాష్ట్రపతిగా కొనసాగిన జగ్ దీప్ ధన్కడ్(Jagdeep Dhankad) రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరుగుతోంది. మరికాసేపట్లో కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేయనుంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎంపిక ఎన్నిక జరగనుంది. ఇందులో భాగంగా ఈ నెల 20న ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కూటమి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బీజేపీ అధిష్టానం పిలుపునిచ్చింది.

ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. 20న జరిగే ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు. అనంతరం పనిలో పనిగా పలువురు కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. విభజన హామీలు, రావాల్సిన నిధులు విడుదల చేయాలని చంద్రబాబు కోరనున్నారు.

Next Story