- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసిస్టెంట్ ప్రొఫెసర్ వక్రీకృత బుద్ధి.. అమరావతి ఎస్ఆర్ఎమ్ వర్సిటీలో కలకలం
విద్యాబుద్ధులు నేర్పాల్సిన వర్సిటీ ప్రాంగణంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ వక్రీకృత బుద్ధి బయటపడింది. అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఉబైద్ ముస్తాఖ్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే వర్సిటీలో పనిచేస్తున్న తోటి మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. .

దిశ, వెబ్ డెస్క్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన వర్సిటీ ప్రాంగణంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ వక్రీకృత బుద్ధి బయటపడింది. అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ (SRM) విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఉబైద్ ముస్తాఖ్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే వర్సిటీలో పనిచేస్తున్న తోటి మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. బాధితురాలికి సంబంధించిన ఫోటోలను, వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరంగా పోస్ట్ చేస్తూ అతను పైశాచిక ఆనందం పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
యాజమాన్యాన్ని ఆశ్రయించినప్పటికీ..
ఈ వేధింపులపై బాధితురాలు తొలుత విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని ఆశ్రయించినప్పటికీ, వారు దీనిని పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. యాజమాన్యం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆవేదనకు గురైన సదరు మహిళా ప్రొఫెసర్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. తన గౌరవానికి భంగం కలిగిస్తూ, సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్న ఉబైద్ ముస్తాఖ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
నిందితుడిపై కేసు ఫైల్
మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు నిందితుడైన ఉబైద్ ముస్తాఖ్‌పై కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్‌తో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు వేగవంతం చేశారు. ఉన్నత చదువులు చదివి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటం పట్ల తోటి అధ్యాపకులు, విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.






