చాగల్లులో ఘోరం: దంపతులపై నుంచి దూసుకెళ్లిన లారీ.. భార్య మృతి

by Vemula.Srinu Prasad |

తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో నిండు నిర్లక్ష్యం కారణంతో మహిళ ప్రాణం పోయింది. దీంతో మహిళా దినోత్సవం రోజునే విషాదం చోటు చేసుకుంది....

చాగల్లులో ఘోరం: దంపతులపై నుంచి దూసుకెళ్లిన లారీ.. భార్య మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari) చాగల్లు(Chagallu)లో నిండు నిర్లక్ష్యం కారణంతో మహిళ ప్రాణం పోయింది. దీంతో మహిళా దినోత్సవం(Women Day) రోజునే విషాదం చోటు చేసుకుంది. చాగల్లులో రోడ్డు మార్జిన్‌లో డ్రైవర్ కారును నిలిపి ఉంచారు. అయితే అటుగా దంపతులతో ఉన్న బైక్ వచ్చింది. అయితే కారు డోర్‌ను సడెన్‌గా తీయడంతో బైక్ కు తగిలి దంపతులు రోడ్డుపై పడ్డారు. వెనుకనే వచ్చి లారీ దంపతులపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని ఆస్పత్రికి, మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story