- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ బొత్స వర్సెస్ లోకేశ్.. కల్తీ ఘటనపై దద్దరిల్లిన మండలి
తిరుమల లడ్డూ వ్యవహారం మరోసారి శాసనమండలిని దద్దరిల్లేలా చేసింది...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వ్యవహారం(Tirumala laddu affair) మరోసారి శాసనమండలి(Legislative Council)ని దద్దరిల్లేలా చేసింది. ఈ అంశంపై శాసనమండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) వర్సెస్ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీ నెయ్యి కేసులో గజ దొంగను పట్టుకోవాలని ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యానించారు. ఇందుకు కౌంటర్‌గా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బొత్స చెబుతున్న గజ దొంగ జగనేనా అని కౌంటర్ ఇచ్చారు. జగన్‌ను పట్టుకోవాలని అన్నారా.. అయితే తాము కూడా అదే పని చేస్తున్నామని చెప్పారు. లడ్డూ కల్తీ కేసులో సిట్ విచారణలో నిందితులెవరో తేల్చింది కదా అని లోకేశ్ వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో తమపై ఆరు కేసులు పెట్టారని, అయితే వాటికి సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని మంత్రి నారా లోకేశ్(Minsiter Nara Lokesh) విమర్శించారు.






