- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు
by Vemula.Srinu Prasad |
ఏడు కొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అనే నామస్మరణతో తిరుమలగిరులు మారుమోగిపోతున్నాయి...

X
దిశ, వెబ్ డెస్క్: ఏడు కొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అనే నామస్మరణతో తిరుమలగిరులు(Tirumala) మారుమోగిపోతున్నాయి. వీకెండ్ కావడంతో కుటుంబసమేతంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండి వెంకన్న(Lord Venkanna)ను దర్శించుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖల తాకిడి సైతం తిరుమలకొండకు పెరిగింది. శ్రీనివాసుడికి ఇష్టమైన రోజు శనివారంకావడంతో ఈ రోజు తెల్లవారుజామునుంచే ఆయన్ను దర్శించుకుంటున్నారు.
తిరుమల కొండకు సినీ దర్శకుడు అనిల్ రావిపూడి(Director Anil Ravipudi), మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి(Former Mp Vijayasaireddy), దర్శుకుడు ఎస్ గోపాల్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళి మోహన్ వెళ్లారు. గర్భగుడిలో కొలువైన వెంకన్నను కనులారాగా వీక్షించి తరించిపోయారు. మనస్పూర్తిగా కోరికలు కోరుకుని తిరుగుపయనమయ్యారు.
Next Story






