ఏపీలో మరో రూటుకు లైన్ క్లియర్.. ట్రయల్ రన్ పూర్తి

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైలు వచ్చే సమయం ఆసన్నమైంది...

ఏపీలో మరో రూటుకు లైన్ క్లియర్.. ట్రయల్ రన్ పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైలు(Rail) వచ్చే సమయం ఆసన్నమైంది. నడికుడి- మార్కాపురం-కనిగిరి-పామూరు-శ్రీకాహస్తికి రైల్వే లైన్ కావాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఇందుకు రైల్వే అధికారులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైల్వే లైన్(Railway Line) ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగారు. మార్కింగ్ చేశారు. భూములు సైతం సేకరించారు. కానీ ఓ చోట భూ సేకరణ విషయంలో చాలా ఆలస్యం అయింది. ప్రధానంగా కనిగిరి, పామూరు మండలాల్లో 50 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణ పనులు నత్తనడక సాగాయి.

దీంతో కూటమి ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించింది. ఈ మేరకు భూసమీకరణ ప్రాబ్లమ్ తీరిపోయింది. పనులు శరవేగంగా జరిగాయి. రైల్వే లైన్ నిర్మాణ పనులు వెంటనే ఊపందుకున్నాయ. ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులు ఇటీవల పూర్తి అయ్యాయి.

తాజాగా ఈ రైల్వే లైన్‌పై ట్రయల్ వేశారు. నడికుడి నుంచి కనిగిరి వరకూ రైలు ఇంజిన్‌ను నడిపారు. ట్రయల్ విజయవంతం కావడంలో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. దశాబ్దాల కల సాకారం అయిందని, త్వరలో ఈ రూటులో రైలు రాకపోకలు సాగనున్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.

Next Story