- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fire Accident: పంట పొలాలకు నిప్పు పెట్టిన దుండగులు.. ఏం జరిగిందంటే..?
by Indraja |
సత్యసాయి జిల్లాలోని నల్లమాడ మండలం, సీకివారి పల్లిలో రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ,ప్రతినిధి పుట్టపర్తి: సత్యసాయి జిల్లాలోని నల్లమాడ మండలం, సీకివారి పల్లిలో రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని పంట పొలాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
దీనితో గ్రామ సమీపంలో ఉన్న జామ తోటకు మంటలు వ్యాపించడంతో మంటలు మరింత ఎగసి పడ్డాయి. మంటలు ఎగసి పడుతూ ఊరివైపు వస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు.
మంటలను చూసిన గ్రామ యువకులు అప్రమత్తమైయ్యారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్నారు.
అనంతరం శాయశక్తులా ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో పెద్ద నష్టం తప్పింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.సకాలంలో స్పందించి భారీ నష్టం జరగకుండా చేసిన అగ్నిమాపక సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.
Next Story






