CS Vijayanand:ప్రతి నెల మూడో శనివారం.. ‘స్వచ్ఛత దినంగా పాటించాలి’

by Jakkula.Mamatha |

పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)ను తీర్చిదిద్ది.. దేశంలోనే అగ్రగామిగా నిలపాలని ఎన్డీయే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

CS Vijayanand:ప్రతి నెల మూడో శనివారం.. ‘స్వచ్ఛత దినంగా పాటించాలి’
X

దిశ,వెబ్‌డెస్క్: పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)ను తీర్చిదిద్ది.. దేశంలోనే అగ్రగామిగా నిలపాలని ఎన్డీయే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ప్రతినెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛదివస్‌’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌(CS Vijayanand) వెల్లడించారు. అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. రేపు(శనివారం) కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 12 నెలలకు 12 థీమ్‌లతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు. నెలకో అంశాన్ని ఎంచుకుని స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలు ఇందులో ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు.

Next Story