- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు ఎక్కుతుండగా నర్సు పర్సు కొట్టేసిన ఎంపీడీవో భార్య.. భర్త సైతం అరెస్ట్
ఎంపీడీవో భార్య చోరీ ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేగింది....

దిశ, వెబ్ డెస్క్: ఎంపీడీవో(Mpdo) భార్య చోరీ ఘటన పల్నాడు జిల్లా(Palnadu District)లో కలకలం రేగింది. విజయవాడ బస్ స్టేషన్(Vijayawada)లో బస్సు ఎక్కే సమయంలో స్టాఫ్ నర్సును ఎంపీడీవో భార్య కొట్టేశారు. ఈ నెల 29న ఘటన జరిగింది. పోలీసులు విచారణలో సంచలన అసలు విషయాలు బయటకు వచ్చాయి. పల్నాడు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఎంపీడీవో గుంటూరులో నివాసం ఉంటున్నారు. విజయవాడలో చదువుతున్న కుమార్తె వద్దకు ఎంపీడీవో ఫ్యామిలీ వెళ్లింది. తిరిగి పయనంలో విజయవాడ బస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. గుంటూరు బస్సు రావడంతో ఎంపీడీవో ఫ్యామిలీ కూడా అందులోకి ఎక్కారు.
అయితే బస్సు ఎక్కే సమయంలో క్యూలో ఉన్న నర్సు పర్సు కొట్టేశారు. అనంతరం గుంటూరు వెళ్లిపోయారు. ఈ మేరకు నర్సు ఫిర్యాదుతో విజయవాడ బస్ స్టేషన్‌లోని సీసీ టీవీఫుటేజులను పోలీసులు పరిశీలించారు. దీంతో ఎంపీడీవో భార్య చేతివాటం వెలుగులోకి వచ్చింది. నర్సు పర్సు ఎంపీడీవో సతీమణి కొట్టేసినట్లు గుర్తించారు. సీసీపుటేజులో ఎంపీడీవో కుమార్తె యూనిఫాం ఆధారంగా కాలేజీని గుర్తించి దర్యాప్తు చేశారు. గుంటూరు ఎంపీడీవో నివాసానికి వెళ్లి విచారణ చేపట్టంతో నర్సు పర్సు వాళ్ల ఇంట్లోనే దొరికింది. చోరీని బయటకు చెప్పకుండా దాచిపెట్టినందుకు ఎంపీడీవోతో పాటు ఆయన భార్యను కూడా అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.






