- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా వరద ప్రవాహం.. టెన్షన్ పెడుతున్న మున్నేరు వాగు
ఇటీవల కురిసిన వర్షాల(Rains)తో వాగులు, వంకలు ప్రమాదకరంగా మారాయి....

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కురిసిన వర్షాల(Rains)తో వాగులు, వంకలు ప్రమాదకరంగా మారాయి. భారీగా వరద ప్రవాహం వచ్చిన చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాగులు ఉధృతికి తమ గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరితే పరిస్థితేందనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని మున్నేరు వాగు(Munneru Wagu) స్థానిక ప్రజలను టెన్షన్ పెడుతోంది. లింగాల వద్ద వాగులో వరద ప్రవాహం రోడ్డుపైకి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలను నిలిపివేశారు. ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలను పెనుగంచిప్రోలు బ్రిడ్జి(Penuganchiprol Bridge) వైపు మళ్లించారు. మరోవైపు పోలంపల్లి డ్యామ్(Polampalli Dam) వద్ద నీటి ప్రవాహం భారీగా పెరిగింది. ఈ మేరకు డ్యామ్ నీటిమట్టం పదిన్నర అడుగులకు చేరింది. దీంతో దిగువన ఉన్న కృష్ణానది(Krishna River)కి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో స్థానిక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.






