టీడీపీకి బిగ్ షాక్.. సొంతగూటికి చేరిన ముగ్గురు నేతలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-09 16:16:41  IST  )

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది....

టీడీపీకి బిగ్ షాక్.. సొంతగూటికి చేరిన ముగ్గురు నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) ప్రొద్దుటూరు(Proddutur)లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీపై కన్నేసిన ఆ పార్టీ ఇటీవల ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. దీంతో ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు సైకిల్ ఎక్కారు. ప్రొద్దటూరు 8వ వార్డు కౌన్సిలర్ రాగుల శాంతి, 39వ వార్డు కాన్సిలర్ రావులకొల్లు అరుణ, 40వ వార్డు కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే ఇంతలోనే కౌన్సిలర్లు మనసు మార్చుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(Former MLA Rachamallu Sivaprasad Reddy)ని ఈ రోజు కలిశారు. ఆయన సమక్షంలో తిరిగి వైసీపీ(YCP) గూటికి చేరారు. అలా టీడీపీలో చేరి ఇలా మళ్లీ వైసీపీలో చేరడం ప్రస్తుతం ప్రొద్దుటూరులో ముగ్గురు కౌన్సిలర్ల తీరు చర్చనీయాంశంగా మారింది.


అయితే తమ పార్టీ నుంచి వెళ్లిన వారికి టీడీపీ(TDP)లో గౌరవం ఉండదని, ఇప్పటికైనా తమ కౌన్సిలర్లు తెలుసుకున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఈ ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరినప్పుడు కూడా వారి అభిప్రాయాన్ని గౌరవించానని తెలిపారు. తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు తిరిగి మళ్లీ ఎప్పుడు పార్టీలోకి వచ్చినా సంతోషంగా ఆహ్వానిస్తానని శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

READ MORE ...

Breaking: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు





Next Story