బనకచర్లపై జీవో 16 జారీ.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-11 13:05:23  IST  )

బనకచర్లపై జీవో 16 జారీపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు..

బనకచర్లపై జీవో 16 జారీ.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో గోదావరి జలాల(Godavari Water)ను ప్రజలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం(Coalition Government) బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై తొలి నుంచీ తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తోంది. గోదావరి బోర్డు ఎదుట ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే గోదావరి-బనకచర్ల లింకుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో 16ను జారీ చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా గోదావరి బోర్డుతో పాటు పోలవరం అథారిటీకి తాజాగా లేఖ రాసింది. గోదావరి-బనకచర్ల లింకుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు ఆ ప్రాజెక్టును ఏపీ ముందుకు తీసుకెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఏపీ విడుదల చేసిన జీవో 16 కాపీని లేఖకు జత చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని అటు కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి సైతం రేవంత్ సర్కార్ తీసుకెళ్లింది.

Next Story