నారా లోకేష్‌కు డిప్యూటీ CM.. స్పందించిన టీడీపీ అధిష్టానం

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో(Andhra Pradesh Politics) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

నారా లోకేష్‌కు డిప్యూటీ CM.. స్పందించిన టీడీపీ అధిష్టానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో(Andhra Pradesh Politics) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)ను ఉప ముఖ్యమంత్రి చేయాలని టీడీపీ(TDP) క్షేత్రస్థాయి లీడర్ల నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు అందరూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఈ అనూహ్య పరిస్థితిపై టీడీపీ అధిష్టానం స్పందించింది. ఆ డిమాండ్‌ను లేవనెత్తిన లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాది కూడా పూర్తవకముందే ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం కరెక్ట్ కాదని చురకలు అంటించింది. ప్రజలు మనమీద పెద్ద బాధ్యతను పెట్టారని.. మన బాధ్యత అభివృద్ధి, సంక్షేమ అని అన్నారు. ఈ అంశంపై ఇక నుంచి నేతలెవరూ అత్యుత్సాహం ప్రదర్శించొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని ప్రకటన చేసింది.

ఇదిలా ఉండగా.. నారా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేసిన నేతల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ(SVSN Verma) కూడా ఉన్నారు. టీడీపీకి కోటి సభ్యత్వాలు చేయించిన నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవికి వందశాతం అర్హులు అని అన్నారు. టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ ‘యువగళం’తో లోకేష్ సమాధానం చెప్పారని తెలిపారు. ‘నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి’ అని వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ అధిష్టానం స్పందించి సీరియస్ అయ్యింది.

Next Story