Konaseema: బాలిక ఆత్మహత్య చేసుకుందా.. హత్య చేశారా?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-05 11:42:14  IST  )

కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపింది..

Konaseema: బాలిక ఆత్మహత్య చేసుకుందా.. హత్య చేశారా?
X

దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా(Konaseema District) రామచంద్రాపురం(RamaChandrapuram)లో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రైవేటు స్కూలు(Private School)లో ఐదో తరగతి విద్యార్థిని ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించారు. అయితే బాలిక ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తమ కూతురు మృతికి టీచర్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. బాలిక మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story