- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రకటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు
తప్పు దారి పట్టించే వైద్య ప్రకటనలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది..

దిశ, వెబ్ డెస్క్: దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం(Free Medical Services) అందుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా వైద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నాయి. అధిక నిధులు కేటాయిస్తున్నాయి. ఉచిత వైద్య సేవలు కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో ‘ఆరోగ్య శ్రీ’(Aarogya Sri), బీజేపీ(Bjp) సర్కార్ వచ్చిన తర్వాత ‘ఆయుష్మాన్ భారత్’(Ayushman Bharat)తో పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో ఈ రెండు స్కీములతో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్‌లో పేదలకు ఉచిత వైద్యం అందుతోంది.
అయితే ఈ వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు హాస్పిటల్స్ కూడా వైద్య ప్రకటనలు ఇస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులైతే వ్యాపార దృక్పదంతో తామే వైద్య సేవలను మెరుగ్గా అందిస్తున్నట్లుగా యాడ్స్‌లో చూపిస్తున్నాయి. పేపర్, టీవీలతో పాటు బస్సులు, ప్రభుత్వ ప్రాపర్టీల వద్ద కూడా యాడ్లు కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని యాడ్లు తప్పు దారి పట్టిస్తున్నాయి. పైకి యాడ్ రూపంలో చెప్పేవి ఒకటి.. రోగులు అక్కడికి వెళ్లిన తర్వాత జరుగుతోంది మరొకటి. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తప్పుదారి పట్టిస్తున్న వైద్య ప్రకటనలపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తప్పుదారి పట్టించే వైద్య ప్రకటనలపై చర్యలు తీసుకోవడంలో ఆయా ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఏపీ, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తప్పుదారి పట్టించే వైద్య ప్రకటనలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మార్చి 7న విచారణకు వర్చువల్‌గా హాజరుకావాలని ఆదేశించింది.






