- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు ఏపీ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రధానంగా గూడూరులో ఎండలు ముదురుతున్నాయి..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సూర్యుడు(Sun) తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రధానంగా గూడూరులో ఎండలు(Heat Waves) ముదురుతున్నాయి, అక్కడ అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి తోడు సైదాపురంలో 42.6, ఒంటిమిట్టలో 42.3, మరియు మార్కాపురంలో 42.1 డిగ్రీల మేర ఎండ తీవ్రత కొనసాగుతోంది. పట్టపగలు జనం బయటకు రావాలంటేనే వణికిపోయేలా వాతావరణం సెగలు కక్కుతోంది. ఉక్కపోత, వేడి గాలులతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు.
సీమ నుంచి కోస్తా వరకు...
రాయలసీమ నుంచి కోస్తా వరకు ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. డోర్నిపాడులో 41.8, గోస్పాడులో 41.7, కనిగిరిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, దుత్తలూరు, అర్ధవీడు ప్రాంతాల్లో 41.3 డిగ్రీల వేడి నమోదైంది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కూడా 41 డిగ్రీలతో ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






