- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో దంచికొడుతున్న ఎండలు.. ఈ రోజు తీవ్రత ఎంతో తెలిస్తే..?

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఎండలు దండి కొడుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండలు(Sun) మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయితే బయట నిలబడలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎక్కడ బయటకు వస్తే సుర్రుసుమ్మంటోందని జనాలు జంకిపోతున్నారు.
కాగా రాష్ట్రంలో ఇటీవలే ఉష్ణోగ్రతలు వాతావరణం మారిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి రోజు ఎండల తీవ్రత పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదు అయ్యాయి. దీంతో పట్టణాలు, పల్లెల్లోనూ గురువారం ఎండలు భగ భగ మండిపోయాయి.
రాష్ట్రమొత్తం మీద 35 డిగ్రీలకు పైగా సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా సి. బెలగల్‌లో 35.9 డిగ్రీల సెల్సియస్, సత్యసాయి జిల్లా కొత్త చెరువులో 35.9 డిగ్రీల సెల్సియస్, నంద్యాల, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, ప్రకాశం జిల్లా కనిగిరిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ మేరకు వెదర్ డిపార్ట్‌మెంట్ పూర్తి వివరాలు వెల్లడించింది.