- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాడు పగిలిపోతోంది బాబోయ్.. ఏందీ ఉష్ణోగ్రతలు.. !
రాష్ట్రంలో ఎండలు మాడుపగలగొడుతున్నాయి..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండలు(Sun) మాడుపగలగొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తీవ్ర ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయితే ఇక సెగలు, పొగలే కక్కుతున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకిపోతున్నారు. కొద్దిసేపు ఎండలోకి వెళ్తి వెంటనే నిరసన పడిపోతున్నారు. గొడుగులతో వెళ్లినా ఉక్క, సెగలు, వాడగాల్పుల దెబ్బకు బేవ్ మంటున్నారు. మరోవైపు రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి.
శనివారం అత్యధికంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.08 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ప్రకాశం జిల్లా గొల్లవిడిలో 2 డిగ్రీలు తగ్గి 42.06, పల్నాడు జిల్లా కాకానిలో 41.06, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 41.05 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. దీంతో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎండలో బయటకు వెళ్లిన సమయంలో పానియాలు, ఫ్రూట్ జూసులు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మజ్జిగ, రాగి జావలాంటివి అందుబాటులో ఉంచుకోవాలని, ఎండ వేడమి నుంచి ఎప్పటికప్పుడు ఉపశమనం పొందెలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పెద్దలు ఓఆర్ఎస్‌లు తీసుకోవాలని చెప్పారు. వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, బెట్ట దెబ్బ తగిలే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.






