- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో భానుడి భగభగలు.. ప్రజలకు బిగ్ అలర్ట్
ఏపీలో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. ఏప్రిల్ ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఎండలు(Heat) నిప్పులు కురిపిస్తున్నాయి. ఏప్రిల్ ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు(Temperatures) అనూహ్యంగా పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుండి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళ ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతుండగా, చాలా ప్రాంతాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి.
ప్రజలకు అలర్ట్
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. సాయంత్రం వరకు వేడి గాలులు వీస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు వివరిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
ఎండల నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని, బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని, ఎప్పటికప్పుడు నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నూనె పదార్థాలకు దూరంగా ఉండి తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని, ప్రత్యక్ష ఎండలో ఎక్కువ సేపు ఉండకూడదని సూచిస్తున్నారు.






