నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్రత భయాందోళనకు గురి చేస్తోంది...

నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్రత భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా నంద్యాల జిల్లాలో అత్యధికంగా 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. కడపలో 42.7 డిగ్రీలు, ప్రకాశం జిల్లాలో 42.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయింది. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకిపోతున్నారు.

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ..

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెండు చోట్ల 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే వేడి గాలులు మొదలవుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగినన్ని నీళ్లు తాగుతూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Next Story