మన్యం జిల్లా మల.. మల..!

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ...

మన్యం జిల్లా మల.. మల..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా అక్కడ ఏకంగా 45 డిగ్రీల మార్కును దాటడం మన్యం వాసులను ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ జిల్లాల్లోనూ ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. కర్నూలులో 43.7, నంద్యాల 43.6, అనంతపురం 43.5, మరియు కడపలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు కోస్తాంధ్రలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. విజయనగరంలో 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

మిగిలిన ప్రాంతాల్లోనూ....

మిగిలిన ప్రాంతాల్లోనూ ఉక్కపోత, ఎండ తీవ్రత జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అనకాపల్లిలో 43.3, మార్కాపురంలో 43.1, కాకినాడలో 42.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో 42 డిగ్రీల వేడి రికార్డయ్యింది. మధ్యాహ్నం వేళ జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Next Story