రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ.. రూ. 1000 కోట్లు విడుదల

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ పట్టనుంది...

రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ.. రూ. 1000 కోట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో చాలా రోడ్లు అధ్వాన్నంగా మారాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో కొత్త రోడ్లతో పాటు మరమ్మతులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా రోడ్లను పట్టించుకోవడంలేదనే విమర్శలు తీవ్రమయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి పెట్టింది. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో చర్చించింది. మొత్తం 274 రోడ్ల పనులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 1000 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇందుకు అవసరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దెబ్బతో రాష్ట్రంలోని రోడ్లన్ని బాగుపడనున్నాయని కూటమి నేతలు తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లను పట్టించుకోలేదని, తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు.

Next Story