- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైఎస్సార్ జిల్లాలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పర్యటించిన క్రమంలో పేరు మార్పు పై హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM Jagan) పేర్ల పిచ్చితో కడప అనే పదాన్ని లేకుండా వైఎస్సార్ జిల్లాగా మార్చడాన్ని తప్పుపట్టారు.
ఈ తరుణంలో ప్రజల నుంచి కూడా పలు వినతులు రావడంతో వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా వైఎస్‌ఆర్ జిల్లా పేరును మారుస్తూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లాను.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చింది. పేరు మార్పు పై గతంలో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.






