శ్రీచరణికి రూ. 2.5 కోట్ల చెక్ అందజేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-17 12:33:45  IST  )

టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతి అందజేసింది. ...

శ్రీచరణికి రూ. 2.5 కోట్ల చెక్ అందజేత
X

దిశ,వెబ్ డెస్క్: టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణి(Team India womens cricketer Sricharani)కి రాష్ట్ర ప్రభుత్వం(State Govt) నగదు బహుమతి అందజేసింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌(ICC Women ODI World Cup)లో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. అంతేకాదు జట్టు విజయంలో శ్రీచరణి కీలకపాత్ర పోషించారు. దీంతో ప్రోత్సాహకంగా ఆమెకు నగదు, ఇంటి స్థలంతో పాటు ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శ్రీచరణికి ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేశారు. కడప(Kadapa)లో 500 గజాల విస్తీర్ణంలో ఇంటి స్థలం పేపర్లు కూడా అందజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీచరణి డిగ్రీ చదువుతున్నారని, పూర్తి అయిన తర్వాత గ్రూప్-1 హోదా ఉద్యోగం ఇస్తామని లోకేశ్ తెలిపారు.

కాగా శ్రీచరణి సొంతూరు కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామం. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగి. శ్రీచరణి చిన్నప్పటి నుంచి స్పిన్ బౌలర్‌గా రాణించారు. ఈ ప్రతిభతో టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. మహిళా వరల్డ్‌కప్‌లోనూ తనదైన బౌలింగ్‌తో సత్తా చాటారు. వరల్డ్ కప్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన ఆమె 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీశారు. వరల్డ్ కప్ ఫైనల్‌లో స్పిన్ మాయాజాలం చేశారు.

Next Story