Good News: ఆ ఉద్యోగుల జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-12 09:08:38  IST  )

రాష్ట్రంలోని ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

Good News: ఆ ఉద్యోగుల జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏపీ(Andhra Pradesh)లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల(గెస్ట్ ఫ్యాకల్టీ) వేతనాల పెంపునకు కూటమి ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం(AP Government) రాష్ట్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ(Govt Junior College)ల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు శుభవార్త చెప్పింది.

వారికి జీతాలు పెంచుతూ ఇవాళ(సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఇప్పటివరకు గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.10వేలు ఇవ్వాలనే నిబంధన ఉండేది. ఈ క్రమంలో ప్రస్తుతం గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని రూ.375 కు పెంచగా, నెలకు అత్యధికంగా రూ.27,000గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని కూటమి ప్రభుత్వం వెల్లడించింది.

Next Story