- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి రూ. 124 కోట్లు.. కేబినెట్ కీలక నిర్ణయం
ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి రూ. 124.5 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో భేటీ అయిన కేబినెట్ పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది..

దిశ,వెబ్ డెస్క్: ఢిల్లీ(Delhi)లో ఏపీ భవన్(Ap Bhavan) నిర్మాణానికి రూ. 124.5 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్(Cabinet) నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అధ్యక్షతన వెలగపూడి సచివాలయం(Velagapudi Secreatariat)లో భేటీ అయిన కేబినెట్ పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. హైకోర్టు, జిల్లా న్యాయవవస్థలలో 21 పోస్టులకు ఆమోదం తెలిపారు. హోంశాఖలో 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌కు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపారు. కడపలో డంపింగ్ యార్డ్ కోసం 92 ఎకరాలు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిలో స్పోర్ట్స్ స్కూలు కోసం భూములు కేటాయింపునకు ఆమోదముద్ర వేశారు. హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు రూ.3099 కోట్ల సవరణ అంచనాకు కేబినెట్ ఆమోదం తెలిపింది.






