- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివేకా హత్యకు స్పాట్ పెట్టింది ఆయనే: సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత
మాజీ మంత్రి, దివంగత నేత వివేకానందారెడ్డి హత్యకు స్పాట్ పెట్టింది.. రక్తపు మరకలు శుభ్రం చేయించింది అవినాష్‌రెడ్డేనని పులివెందుల టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి ఆరోపించారు

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, దివంగత నేత వివేకానందారెడ్డి(Vivekananda Reddy) హత్యకు స్పాట్ పెట్టింది.. రక్తపు మరకలు శుభ్రం చేయించింది అవినాష్‌రెడ్డే(Ys Avinash Reddy)నని పులివెందుల టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి(TDP in charge B.Tech Ravi) ఆరోపించారు. వివేకా హత్యపై అవినాష్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వివేకాను చంపి నిజాయితీపరుడిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వివేకా గుండెపోటు కథ ఎవరిదో దేమవంతటా తెలుసని ఎద్దేవా చేశారు. గుండెపోటు సృష్టికర్త సునీత అని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు. విశాఖ హత్య రక్తపు మరకలను తుడిచిన వారిని కాపాడేందుకే అవినాష్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని బీటెక్ రవి వ్యాఖ్యానించారు.
సునీత, సౌభాగ్యమ్మ ఒప్పుకుంటే..
గత ఎన్నికల్లో పోటీకి సునీత, సౌభాగ్యమ్మ ఒప్పుకుంటే అవినాష్ ఎక్కడ ఉండేవారా అని బీటెక్ రవి ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డికి ఎంపీ పదవి సునీత పెట్టిన భిక్ష అని చెప్పారు. వివేకా హత్యకేసులో నిజానిజాలు బయటకు రావాలని, ఈ మేరకు పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్ద తాను చర్చకు సిద్ధమా అని అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సవాల్ విసిరారు.






