18న పలమనేరులో జాబ్ మేళా

by Vemula.Srinu Prasad |

నిరుద్యోగ యువతకు ఈనెల 18న పలమనేరులో భారీ జాబ్ మేళాను నైపుణ్యాభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది...

18న పలమనేరులో జాబ్ మేళా
X

దిశ, చిత్తూరు: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈనెల 18వ తేదీ బుధవారం పలమనేరులో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. గుణశేఖర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా పలమనేరులోని శ్రీ విద్యా డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయని ఆయన పేర్కొన్నారు. సుమారు 25 ప్రముఖ సంస్థలు ఈ మేళాకు హాజరవుతున్నాయని... పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ ఉత్తీర్ణులై... 18 నుంచి 35 ఏళ్ల మధ్య కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈజాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 13వేలు నుంచి రూ. 30వేలు వరకు వేతనం లభిస్తుందన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాల కోసం రసూల్ (6300954441) లేదా సిసింద్రి (8465830771) నంబర్లను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

Next Story