తిరువూరులో పరిస్థితి ఉద్రిక్తం.. ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు

by Kema Shiva Kumar |

తిరువూరు (Thiruvur) మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక టెన్షన్ పుట్టిస్తోంది.

తిరువూరులో పరిస్థితి ఉద్రిక్తం.. ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరువూరు (Thiruvur) మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక టెన్షన్ పుట్టిస్తోంది. ఏడాది క్రితం వరకు 17 మంది కౌన్సిలర్లతో తిరువూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పార్టీలో వర్గపోరుతో ప్రస్తుతం తిరువూరు మున్సిపాలిటీ చైర్‌ పర్సన్ ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిలర్లకు పోలీసులు భద్రత కల్పించడం లేదని, EC ఆదేశాలను పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కౌన్సిలర్లకు డీసీపీ (DCP) స్థాయి అధికారితో భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక అయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షించాలని సూచించింది.

తిరువూరులో తీవ్ర ఉద్రక్తత..

మరోవైపు తిరువూరు (Thiruvur)లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు వైసీపీ నేతలను హౌజ్ అరెస్ట్ (House Arrest) చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు (Malladi Vishnu) తిరువూరుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను మర్గమధ్యలో అడ్డుకుని మరోచోటికి తరలించారు. అదేవిధంగా వైసీపీ నేతలు, దేవినేని అవినాష్ (Devineni Avinash), ఎమ్మెల్సీ అరుణ్‌ (MLC Arun)ను అడ్డుకునేందుకు బావడ టోల్‌గేట్ వద్ద టీడీపీ నేతలు మోహరించారు. ఇక తిరువూరు వైసీపీ నేతల స్వామి దాస్ (Swamy Das) ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. 13 వార్డు కౌన్సిలర్‌ను అప్పజెప్పాలంటూ వారు ఆందోళన చేపట్టారు. దీంతో స్వామి దాస్ ఇంటి ముందు టీడీపీ, వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Next Story