వేసవి సెలవులకు ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-01 05:18:30  IST  )

స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చాయి.

వేసవి సెలవులకు ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ,వెబ్‌డెస్క్: స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చాయి. ఇక విద్యార్థులు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో ఆనందంగా గడుపుతారు. ఈ క్రమంలో సమయం దొరికితే చాలు విద్యార్థులు ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లి ఆటలడుతుంటారు. కానీ.. వేసవి సెలవులు ఇద్దరి అక్కాచెల్లెళ్ల జీవితంలో షాకింగ్ ఘటనను తీసుకొచ్చింది. ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి(Tirupati) జిల్లా కోటలో దారుణ ఘటన వెలుగు చూసింది.

7, 9 తరగతులు చదువుతున్న అక్కాచెల్లెళ్లు స్కూళ్లకు వేసవి సెలవులు(Summer Holidays) రావడంతో ఇంటికి వచ్చారు. కోట మండ‌లం గూడ‌లి స‌మీపంలోని కాల‌నీలో నివాసం ఉంటున్న ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లు కోట గిరిజ‌న గురుకుల పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. వేస‌వి సెల‌వులు కావ‌డంతో ఇంటికి వెళ్లారు. ఆ రోజు రాత్రే ఇద్ద‌రికీ త‌ల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. ఆ మ‌రుస‌టి రోజే పెళ్లిళ్లు చేసేసి భ‌ర్త‌ల వెంట పంపేశారు. 30 ఏళ్ల వ్య‌క్తికి ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌ను ఇచ్చి పెళ్లి చేశారు. అభం శుభం తెలియని అక్కాచెల్లెళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పాఠశాలకు వెళ్లిన ఓ బాలిక తనకు పెళ్లి చేశారని భర్తతో కాపురం చేయాలంటూ తల్లిదండ్రులు వేధిస్తున్నారని తమ టీచర్లకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story