జలప్రళయం రాబోతోందా..? కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద ఊహించని ఘటన

by Ramesh Naini |

కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద ఊహించని ఘటన చోటు చేసుకుంది. అంతర్వేది వద్ద బంగాళాఖాతం అనుహ్యంగా వెనక్కి తగ్గింది.

జలప్రళయం రాబోతోందా..? కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద ఊహించని ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Konaseema district) కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద ఊహించని ఘటన చోటు చేసుకుంది. అంతర్వేది వద్ద బంగాళాఖాతం (Bay of Bengal) అనుహ్యంగా వెనక్కి తగ్గింది. దాదాపు 500 మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లడం కలకలం రేపింది. సముద్రం వెనక్కి వెళ్లిపోవడంతో తీరప్రాంతం మోకాళ్ల లోతు వరకు ఒండ్రు మట్టితో నిండిపోయింది. ఈ సంఘటనతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జలప్రళయం రాబోతోందా..? మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి అంతర్వేది తీరంలో తలెత్తలేదని, సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

గతంలో అంతర్వేది వద్ద సముద్రం కొన్ని మీటర్ల వరకు వెనక్కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు ఇసుక మేటలు ఏర్పడ్డాయని స్థానికులు తెలిపారు. ఈ ఇప్పుడు అర కిలోమీటర్ వరకు సముద్రం వెనక్కి వెళ్లడంపై స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారుల వివరణ కోసం తీర ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Next Story