- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తులకు గమనిక... శ్రీవారి దర్శనం ఎంత సమయం పడుతుందంటే...?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది....

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో భక్తుల(Devotees) రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి(Srivaru) సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్‌లు అన్ని నిండి శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్‌లో వేచియున్నారు. గురువారం శ్రీవారిని 63,208 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,951 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
కాగా వేసవి సెలవులు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తిరుమలకు తరలివస్తున్నారు. పిల్లపాపలతో కలిసి వెంకన్న స్వామిని దర్శించుకుంటున్నారు. అనంతరం శ్రీవారి ప్రసాదం స్వీకరించి తిరిగి పయనం అవుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లలో వేచి ఉన్న వారికి ఆహారం, నీళ్లు వంటి సౌకర్యాలు సైతం కల్పిస్తోంది. భక్తుల తాకిడిపై టీటీడీ ఛైర్మన్, ఈవో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేసవి సెలవు ముగిసే సమయంలో భక్తుల రద్దీ మరింతగా ఉంటుందని, ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలని అధికారులను, సిబ్బందిని టీటీడీ ఛైర్మన్ ఆదేశించారు.






