AP News : నీటి కుంటలోకి దూసుకు పోయిన ఆర్టీసీ బస్

by Muthe.Rajitha |   (  Updated:2025-01-11 17:26:49  IST  )

తిరుపతి(Tirupati)లో ఘోర బస్సు ప్రమాదం(Bus Accident) తృటిలో తప్పింది.

AP News : నీటి కుంటలోకి దూసుకు పోయిన ఆర్టీసీ బస్
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి(Tirupati)లో ఘోర బస్సు ప్రమాదం(Bus Accident) తృటిలో తప్పింది. తోట్టంబేడు మండలం బోనుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు నీటి కుంటలోకి దూసుకు పోయింది. శ్రీకాళహస్తి నుంచి బోనుపల్లి వెళ్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న కుంటలోకి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా.. వారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Next Story