- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పం పరిసరాల్లో ఏనుగుల కలకలం.. అలర్ట్ ప్రకటించిన అధికారులు
by Vemula.Srinu Prasad |
చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి...

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఏనుగుల(Elephants) సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కుప్పం(Kuppam), రామకుప్పం(Ramakuppam), నన్యాల(Nanyala) పరిసరాల్లో రెండు ఏనుగులు అర్ధరాత్రి హల్ చల్ చేస్తున్నారు. గ్రామ సమీపంలో సంచారం చేస్తూ పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు తమ గ్రామాల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఏనుగులను అటవీ శాఖ సమీప అడవుల్లోకి తరిమివేశారు. అయితే రైతులు, ప్రజలకు అలర్ట్ ప్రకటించారు. ఏనుగుల నుంచి రక్షణ కోసం 24 గంటల పాటు పహారా ఏర్పాటు చేశామని తెలిపారు. రాత్రి సమయంలో రైతులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, పంట పొలాల్లోకి వెళ్లొద్దని సూచించారు.
Next Story






