- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు డివైడరుకు పార్టీ రంగులేందయ్యా!!
పార్టీ అంటే అభిమానం ఉండడంలో తప్పులేదు.. కానీ పార్టీ గుర్తులు ఎక్కడ పడితే అక్కడ ఉంటేనే అసలు సమస్య.

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ అంటే అభిమానం ఉండడంలో తప్పులేదు.. కానీ పార్టీ గుర్తులు ఎక్కడ పడితే అక్కడ ఉంటేనే అసలు సమస్య. అందులోనూ ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్డు డివైడర్లకు పార్టీ రంగులను వేస్తే చూసేవారు కొందరు నవ్వుకుంటూ పోతే.. మరికొందరు తిట్టుకుంటూ పోతారు. గత వైసీపీ ప్రభుత్వంలో (YCP Rule) ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ జెండా రంగులను వేసి నవ్వులపాలయ్యారు తెలిసిన విషయమే.. మరి అదే కోవలో జనసైనికులు (Jana Sainiks) కూడా వెళ్తున్నారేమో అనిపించే ఘటన ఒకటి గుంటూరు రూరల్ మండలంలో చోటు చేసుకుంది. వెంగళాయపాలెం (Vengalayapalem) ప్రధాన రహదారిలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ డివైడరుకు జనసేన సింబల్ తో పాటు పేవ్మెంట్స్ గుర్తులుగా జనసేన రంగులను వేశారు. అది చూసిన వారు ఓ వైపు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే.. మరోవైపు ఇదేమి వింత గోల అనుకుంటున్నారు. అయినా అభిమానంలో గుండెల్లో ఉంటే బాగుంటుంది గానీ.. రోడ్డున పడేస్తే ఎలా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అందులోనూ ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఇటువంటి పోకడలు సరికాదని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రమాదాల నివారణకు తెలుపు-నలుపు, పసుపు-నలుపు రంగులను పేవ్మెంట్స్ గుర్తులు వేసేందుకు వినియోగిస్తుంటారు. కానీ వెంగళాయపాలెం ప్రధాన రహదారిలో అందుకు భిన్నంగా జనసేన రంగులు వేయడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.






