టీచర్ల బాధ్యత మాది.. విద్యార్థుల బాధ్యత టీచర్లది : సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-05 08:53:51  IST  )

రాష్ట్రంలోని టీచర్ల బాధ్యత తమదని.. విద్యార్థుల బాధ్యత టీచర్లదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

టీచర్ల బాధ్యత మాది.. విద్యార్థుల బాధ్యత టీచర్లది : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని టీచర్ల బాధ్యత తమదని.. విద్యార్థుల బాధ్యత టీచర్లదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మన్యం జిల్లాలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేస్తే ప్రపంచానికి ఆదర్శ నమూనాగా మారుతుందన్నారు. ఇక్కడి స్వచ్ఛమైన ప్రేమ, అభిమానాలు ఎక్కడా దొరకవన్నారు. విద్యార్థులు మీటింగును పర్ఫెక్ట్ గా చేయడం బాగా అనిపిచిందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలను తెలియజేశారు. 2024 డిసెంబరులో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టామన్నారు. జూలైలో రెండు కోట్ల మందితో రెండో మీటింగ్ పెట్టి గిన్నిస్ రికార్డు సాధించామన్నారు.

సమయం, నిధులు ఖర్చు పెట్టి చేసే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు కోసం చేసే మహత్తర కార్యక్రమాలన్నారు. ఆంధ్రా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలను ఆస్తిగా తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో జనాభా తగ్గుతోందన్నారు. భవిష్యత్తులో పిల్లలు, యువశక్తి ఎక్కువ ఉండే దేశం భారత్ కాబోతుందన్నారు. వారిని తీర్చిదిద్దితే వారి వద్ద తానే నేర్చుకునే రోజులు వస్తాయని చమత్కరించారు. మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషన్ న్యూమరసీ, లిటరసీ (ఎఫ్ఎల్ ఎన్) అని అన్నారు. అన్ని సబ్జెక్టుల్లో బలమైన పునాదులు వేసే కార్యక్రమం అన్నారు. స్కై, మౌంటెన్, స్ట్రీమ్ వర్గాలు వర్గీకరిస్తున్నామని వివరించారు. వారి బలం, బలహీనతలు తెలుసుకోవడం, వారికి ఎలా శిక్షణ ఇవ్వాలనే విషయానికి శ్రీకారం చుట్టారన్నారు. క్లిక్కర్ ద్వారా వినూత్నమైన కార్యక్రమం ఆడియో వీడియోలో బోధించి పరీక్షలు పెడుతన్నారన్నారు. క్లౌడ్ లో సమాధానం రికార్డ్ అవుతుందన్నారు. విద్యార్థి సామర్థ్యం సాంకేతికత ద్వారా అంచనా వేయడం జరుగుతుందన్నారు.

నేడు 53 పాఠశాలల్లో క్లిక్కర్ విధానం ప్రారంభించడం జరిగిందన్నారు. పరీక్షల తరువాత విద్యార్థుల సామరథ్యం తెలుసుకోవడం కాదు చదివిన వెంటనే అంచనా వేసి వారిని సరిదిద్దే పరిస్థితి వచ్చిందన్నారు. మట్టిలో మాణిక్యాలైన విద్యార్థులకు సరైన మార్గదర్శనం చేస్తే ఏదైనా చేసే సామర్థ్యం ఉందన్నారు. అంధ విద్యార్థిని కరుణ అల్లూరి సీతారామ రాజు జిల్లా గిరిజన బిడ్డ విశాఖ ప్రభుత్వ రిసెడెన్షియల్ పాఠశాలలో చదువుతోంది. భారత క్రికెట్ లో తిరుగులేని విజయం సాధించి భారత ప్రతిష్ట పెంచిందన్నారు. పీటీఎంలో అందరినీ భాగస్వాములను చేశామన్నారు. సూపర్ సిక్స్ 18 నెలల్లో సూపర్ హిట్ చేశామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం ఇస్తున్నామన్నారు. పిల్లలే తల్లిదండ్రులకు ఆస్తి, శ్రీరామ రక్ష, భవిష్యత్తు అన్నారు. వారిపై శ్రద్ధ పెడితే కష్టాలు తీర్చే శక్తి వారికి వస్తుందన్నారు.

మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచామన్నారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పరిక్షిస్తున్నం అన్నారు. సన్నని నాణ్యమైన బియ్యం డొక్కా సీతమ్మ పథకం ద్వారా అందిస్తున్నాం అన్నారు. స్టూడెంట్ల స్టేషనరీపై పార్టీ రంగులు తొలగించామన్నారు. రాజకీయ ప్రభావం లేకుండా విద్యార్థులు చదువుకునేందుకు అన్ని చేస్తున్నాం అన్నారు. చాగంటి కోటేశ్వర రావు విలువలను అందరం అర్థం చేసుకునేలా ఆరో తరగతి విద్యార్థి చెప్పడం అభినందనీయం అన్నారు. విలువలు లేకుండా సంపద వ్యర్థమవుతుందన్నారు. విద్యార్థులు భౌతిక ఆనందానికి బానిసలై కన్నవారిని చూసుకోలేని పరిస్థితి ఉందన్నారు. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తాను ఆలోచించామన్నారు. అందుకే చాగంటి కోటేశ్వర రావును నియమించామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు ఒకప్పుడు 45 యాప్స్ పెట్టారన్నారు. ఇప్పుడు ఒక డ్యాష్ బోర్డుతో ఒకే యాప్ తో ఉపాధ్యాయులకు పనులను తేలిక చేశామన్నారు. ఒకటో తరగతి నుంచి జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింకుతో అనుసంధానం చేస్తున్నాం అన్నారు. విద్యార్థులను బెస్ట్ స్టూడెంట్స్ గా చేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. శనివారం నో బ్యాగ్ డే తీసుకొచ్చామన్నారు. ఆడుతూపాడుతూ విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా చేశామన్నారు.

కేవలం చదువే అంటే విసుగొస్తుందన్నారు. ఆడుతుపాడుతూ చదువుకోవాలన్నారు. 24 గంటలు రుద్దితే చదువు రాదని తల్లిదండ్రులకు సూచించారు. ఇష్టంతో చదివితేనే బ్రహ్మాండంగా రాణిస్తారన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థుల కోసం వంద రోజుల పథకం తయారు చేశారన్నారు. షైనింగ్ స్టార్ అవార్డులు ఇస్తున్నారన్నారు. లీప్ యాప్ ద్వారా పిల్లల హిస్టరీని తల్లిదండ్రులు చూసుకోవచ్చని చెప్పారు. క్లస్టర్ అప్రోచ్ ద్వారా విద్యా బోధన జరుగుతోందన్నారు. జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకోవడంలో ఏపీ ముందడుగు వేస్తోందన్నారు. అత్యాధునిక బోధన చేయడానికి పని చేస్తున్నాం అన్నారు.

ఉపాధ్యాయులను ప్రపంచ దేశాలకు పంపి కొత్త విషయాలు నేర్పిస్తున్నామని పేర్కొన్నారు. 2024లో అధికారంలోకి వచ్చాక తన మొదటి సంతకం మెగా డీఎస్పీపై తొలి సంతకం చేశామని గుర్తు చేశారు. కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూసినా వాటిని ధీటుగా ఎదుర్కొని ప్రభుత్వం మెగా డీఎస్సీ పూర్తి చేసిందన్నారు. డిసెంబర్ 10 నుంచి టెట్ పరీక్షలు జరుగుతాయన్నారు. టీచర్ల బదిలీ పథకం తీసుకొచ్చామని చెప్పారు. పిల్లలకు బాగా చదువు చెబితే తేలికగా బదిలీలు చేస్తుందని హామీనిచ్చారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణం వద్ద కాపాల పెట్టారని, మరుగుదొడ్లు శుభ్రం చేయించారని, జీతాలడిగితే వేధించారన్నారు. ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను తాము రద్దు చేశామన్నారు. పిల్లలను ఉత్తమ విద్యార్థులు గా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని, వారి సంక్షేమ బాధ్యత తమదని ప్రకటించారు.

సంక్రాంతి తరువాత స్టూడెంట్స్ కు ఇన్వెటర్స్ పార్ట్నర్ షిప్ సమ్మిట్ ఏర్పాటు చేస్తానన్నారు. అది తాను స్వయంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. దానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తానని తెలియజేశారు. అందులో పిల్లల ప్రతిభను గుర్తించి రివార్డులు ఇప్పంచే బాధ్యతను తానే తీసుకుంటానని ప్రకటించారు.

Next Story