- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుర్గ గుడి స్థలం విషయంలో వివాదం.. ఉద్రిక్తత
తూర్పుగోదావరి జిల్లా (కోనసీమ) కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో కనకదుర్గమ్మ ఆలయ పునర్నిర్మాణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(EastGodavari District) (కోనసీమ) కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారం(Cheyyeru Agraharam)లో కనకదుర్గమ్మ ఆలయ పునర్నిర్మాణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో ఆలయం ఉన్న చోటే మళ్లీ గుడి కట్టాలని గ్రామస్తులు పట్టుబట్టారు. అయితే ఆ స్థలం.. తన పట్టా భూమి అని ఓ రైతు అభ్యంతరం తెలిపారు. తన భూమిని వదులుకోవడానికి నిరాకరించారు. సరిగ్గా శంకుస్థాపన చేయాల్సిన ప్రదేశంలో భారీగా కంకర గుట్టను పోయించి పనులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు రైతు తీరుపై నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ఆలయ స్థలం అక్రమణపై ఆగ్రహం
దశాబ్దాలుగా ఉన్న ఆలయ స్థలాన్ని ఆక్రమించుకోవడం ఏంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. చట్టబద్ధంగా అది తన భూమి అని రైతు వాదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భక్తికి, భూమి వివాదానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో చివరకు విజయం ఎవరిని వరిస్తుందోనని అగ్రహారం గ్రామ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.






