- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Perni Nani: దమ్ముంటే టెండర్లు రద్దు చేయించండి..!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రాష్ట్రంలో మరోసారి రాజకీయ రచ్చకు దారి తీసింది..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Visakha Steel Plant) వ్యవహారం రాష్ట్రంలో మరోసారి రాజకీయ రచ్చకు దారి తీసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేస్తోందన్న ప్రచారంతో పొలిటికల్ హీట్ పెరిగింది. కూటమి నాయకులు, వైసీపీ(Ycp) నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెర్నినాని(Former Minister Perni Nani) మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలపై విమర్శలు కురిపించారు.
ఒక్క ఎంపీ ఉంటే దేశమంతా చెలరేగిపోయేవాడినన్న పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇప్పటివరకూ 42 టెండర్లు పడితే ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే టెండర్లను రద్దు చేయించండని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాదిన్నర అవుతోందని, ఇప్పటి వరకూ వైజాగ్‌కు ఏం చేసిందని ప్రశ్నించారు. టీడీపీ(Tdp) అంతర్జాతీయ పార్టీ అని, జనసేన(Janasena) జాతీయ పార్టీ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.






