- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ల్యాండ్ టైటిలింగ్ పేరుతో గత ప్రభుత్వం కుట్ర చేసింది
రాజముద్రతో పాస్ పుస్తకాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్ : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) పేరుతో గత వైసీపీ (YCP) ప్రభుత్వం ఏపీ ప్రజలపై కుట్ర చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Rama Narayana Reddy) ఆరోపించారు. నెల్లూరు జిల్లా పరిధిలోని అనంతసాగరం మండలంలో ఉన్న ఉప్పలపాడు గ్రామంలో ఆయన శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా రైతులకు రాజముద్ర కలిగిన పట్టా పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో ఇప్పటికే 5,486 పట్టా పాసు పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వంలో పట్టా పాసు పుస్తకాలపై వైయస్ జగన్ బొమ్మ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు యత్నించారని విమర్శలు గుప్పించారు. సర్వే రాళ్లపై కూడా జగన్ ఫోటో ముద్రించి ప్రజాధనం వృధా చేశారని ఎద్దేవా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రాజముద్రలతో కూడిన పాస్ పుస్తకాలను అందజేస్తూ రైతులకు భరోసా కల్పిస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి పక్షాలు పని చేస్తున్నాయని తెలిపారు.






