- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల పర్యటనకు రాష్ట్రపతి ముర్ము.. ఈవో సమీక్ష
నవంబరు 21న భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు...

దిశ, తిరుమల: భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబరు 21న తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముందుగా నవంబరు 20న తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు. ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబరు 21న రాష్ట్రపతి ముందుగా వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన నిమిత్తం కావాల్సిన అన్ని ఏర్పాట్లపై గురువారం తిరుమల పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో టిటిడి అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపం లేకుండా, పూర్తిస్థాయిలో, సమగ్ర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు ఈవో సూచించారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ నాయుడు, సిఈ సత్యనారాయణ, అదనపు ఎస్పీ రామకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.






