- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cock Fight: ఫ్లెక్సీలు కడితే పదవి పాయే...!
కోడి పందేల్లో ఫెక్సీలు, జెండాలు ఏర్పాటు చేసిన జనసేన నేత పదవి పోయింది...

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు(Kankipadu)లో సంక్రాంతి(Sankranti) వేడుకలు ఘనంగా జరిగాయి. కోడి పందేలు(Cock Fight) మూడు రోజుల పాటు జోరుగా సాగాయి. పార్టీలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా కోడి పందేలు జరిగాయి. ఈ పందేల్లో తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పందేల్లోల పాల్గొన్నారు. లక్షల నుంచి కోట్ల మేర బెట్టింగులకు పాల్పడ్డారు. అయితే పందెం రాయుళ్లు, ప్రజలను ఆకర్షించేందుకు చేసిన పని పదవి పోయే పని చేసింది. దీంతో ఆయన లబోదిబో అంటున్నారు. పండగ నేపథ్యంలో ప్రజల కోసం చేస్తే తన పదవి ఊడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంకిపాడు జనసేన(Janasena) పార్టీ చెందిన ముప్పా గోపాలకృష్ణ.. సంక్రాంతి వేడుకలను ఎంజాయ్ చేశారు. కోడి పందేల్లో పాల్గొనే వారికి ఆకర్షించేందుకు శిబిరాల వద్ద జనసేన పార్టీ ఫెక్సీలను, జెండాలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఫ్లెక్సీలు, జెండాల ఏర్పాటుపై పలువురు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విమర్శలు కురిపించారు. ఈ విషయం జనసేన అధినాయకత్వం దృష్టికి వెళ్లింది. దీంతో జనసేన జిల్లా కమిటీ సీరియస్ అయింది. పార్టీకి చెడ్డ పేరు వచ్చిందంటూ ముప్పా గోపాలకృష్ణను సస్పెండ్ చేసింది. కోడి పందేల ప్రాంగణంలో జనసేన ఫెక్సీలు, జెండాలు ఏర్పాటు చేయడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఇందుకు బాధ్యులైన తమను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. ఇకపై జనసేన కార్యక్రమాలతో తమకు ఎలాంటి అధికారిక సంబంధాలు లేవని పేర్కొంది. దీంతో ముప్పా గోపాల్ అతి ప్రదర్శనే తన పదవి పోగొట్టిందంటూ పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.






