- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విజయవాడలో యువకుల దూకుడు.. కళ్లెం వేస్తున్న పోలీసులు
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో బైక్ రైడర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పోర్ట్స్ బైకులపై ఇద్దరు, ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు. అంతేకాదు రోడ్డుపై రయ్ ..రయ్ అంటూ వేగంగా డ్రైవింగ్ చేస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు. దీంతో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మైనర్లు సైతం ఉన్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసి కొన్ని సమయాల్లో మృత్యువాత పడుతున్నారని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని సూచించారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందజేశామని, వాళ్లు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తామని తెలిపారు. మరోసారి ట్రిపుల్ రైడింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అతి వేగంగా వాహనాలు నడిపి చిన్న వయసులో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని పోలీసులు చెప్పారు.