- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచారణకు వెళ్లిన వల్లభనేని వంశీ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
మైనింగ్ కేసులో విచారణకు వెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు పోలీసులు బిగ్ ట్విస్ట్ ఉంచారు..

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former YSRCP MLA Vallabhaneni Vamsi) ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఆయనపై మైనింగ్ కేసు కూడా నమోదు అయింది. ఈ కేసులో విచారణకు తాజాగా గన్నవరం పోలీస్ స్టేషన్‌కు వల్లభనేని వంశీ వెళ్లారు. విచారణ కోసం సంతకాలు చేశారు. అయితే విచారణాధికారి రాలేదు. ఎప్పటికో తీరికగా అధికారి రావడం లేదని సిబ్బంది చెప్పడంతో వల్లభనేని వంశీ తిరిగి వెళ్లిపోయారు.
అయితే గన్నవరం వైసీపీ అనుచరులు, కార్యకర్తలు మాత్రం విమర్శలు చేశాకె. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షకు పాల్పడుతోందని మండిపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న వంశీని విచారణ చేయకుండా గంటలు గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చొబెడుతున్నారని ఆరోపించారు. మళ్లీ విచారణకు ఎప్పుడు రావాలో కూడా సమాచారం ఇవ్వలేదని, అనారోగ్యంతో ఉన్న వంశీని ఈసారైనా త్వరగా విచారించాలని అనుచరులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.






