- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: వల్లభనేని వంశీ కేసు విచారణ ముమ్మరం.. హైదరాబాద్, విశాఖకు పోలీస్ టీములు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Former Gannavaram MLA Vallabhaneni Vamsi)కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం గాలిస్తు్న్నారు. హైదరాబాద్(Hyderabad), విశాఖ(Visakha)కు ప్రత్యేక పోలీస్ బృందాలు వెళ్లాయి. ఫోన్ కాల్స్‌పై ఫోకస్ పెట్టిన పోలీసులు.. నిందితులు ఉపయోగించిన రెండు కార్లను గుర్తించే పనిలో పడ్డారు. టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు.
కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసును ఫిర్యాదుదారుడు కోర్టులో వాపస్ తీసుకున్నారు. పోలీసులే బెదిరించి తనతో ఫిర్యాదు చేయించారని కోర్టుకు వివరించారు. అయితే కేసు వాపస్ తీసుకోవడం వెనుక చాలా జరిగిందని ఫిర్యాదుదారుడు సొందరుడు కోటి పోలీసులకు తెలిపారు. వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరించడంతో తన సోదరుడు అలా చెప్పారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు లభించాయి. దీంతో వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
అయితే ఈ కేసులో మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎలాగైనా సరే నిందితులను గుర్తించి కోర్టుకు అప్పగించాలని పయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, విశాఖపట్నంలో పోలీసులు గాలిస్తున్నారు.






